![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -949 లో... మహేంద్ర, వసుధార, అనుపమ ఇంటికి వస్తారు. శైలేంద్రని షూట్ చేయకుండని ఆపినందుకు అనుపమపై మహేంద్ర విరుచుకుపడుతాడు. ఈ విషయం లో నువ్వు ఎందుకు కలుగుజేసుకుంటున్నావ్. నువ్వు ఆపకుంటే వాడు నా చేతిలో చనిపోయేవాడని మహేంద్ర అనగానే.. వాడు ఇన్ని తప్పులు చేసాడు శిక్ష అనుభవించాలి. అనవసరంగా నువ్వు జైలుకి వెళ్తవని అనుపమ అంటుంది.
అ తర్వాత అయిన పరవాలేదు. వాడు ఎన్ని తప్పులు చేసిన చూస్తూ ఉండాలా అని మహేంద్ర అంటాడు. అయిన అసలు ఎవరు నిన్ను రమ్మన్నారని మహేంద్ర అనగానే.. నేనే రమ్మని చెప్పాను మామయ్య.. అక్కడ జరిగే గొడవ తెలిసి మీరు ఉన్న సిచువేషన్ లో నాకు ఆగలేరని మేడమ్ కి ఫోన్ చేసానని వసుధార చెప్తుంది. ఇప్పుడు మనం తొందరపడితే సఫర్ అయ్యేది ఫణీంద్ర సారే.. అందుకే ఇప్పుడు మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. ముందు రిషి సర్ ఎక్కడ ఉన్నడో కనుక్కోవాలని వసుధార అంటుంది. ముకుల్ కాల్ చెయ్ అని వసుధారకి మహేంద్ర చెప్తాడు. ముకుల్ కి వసుధార కాల్ చెయ్యాబోతుంటే అప్పుడే రిషి కార్ తీసుకోని ముకుల్ ఇంటికి వస్తాడు. ఆ కార్ చూసి రిషి వచ్చాడని వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ వచ్చింది ముకుల్. ఆ తర్వాత ముకుల్ కీ శైలేంద్ర తనతో మాట్లాడిన మాటల గురించి ముకుల్ కీ చెప్తుంది. తనపై తనే శైలేంద్ర ఎటాక్ చేయించుకున్న విషయం గురించి ముకుల్ కి మహేంద్ర చెప్తాడు. ఇలా శైలేంద్ర గురించి ముకుల్ కి చెప్తాడు. మొదట రిషి ఎక్కడ ఉన్నాడో కనుక్కోవాలని ముకుల్ అంటాడు. ఆ తర్వాత వసుధార, రిషి కార్ లో ఎక్కి రిషి పక్కన కూర్చొని ఉన్నట్టుగా అనుకొని బాధపడుతుంది.
ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం వసుధార కాలేజీలో ఉండగా.. మీటింగ్ కండక్ట్ చెయ్యాలని బోర్డు మెంబెర్స్ అంటున్నారని మహేంద్ర అంటాడు. రిషి సర్ లేకుండా ఎలా అని వసుధార అంటుంది. మీరు ఒకే అంటే రిషి సర్ మిషన్ ఎడ్యుకేషన్ పనిమీద టూర్ వెళ్ళాడని చెబ్దామని వసుధార అనగానే ఫణింద్ర, మహేంద్ర సరేనని ఒప్పుకుంటరు. అ తర్వాత అదే విషయం వసుధార నోటీసు బోర్డుపై పెట్టిస్తుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |